ఎంపిక చేసిన టూరిస్టులకు ఉచిత యూఏఈ వీసా

- June 22, 2019 , by Maagulf
ఎంపిక చేసిన టూరిస్టులకు ఉచిత యూఏఈ వీసా

యూఏఈకి ఈ సమ్మర్‌లో ప్రయాణించాలనుకునే టూరిస్టులకు ఉచిత వీసా అందించనుంది యూఏఈ ప్రభుత్వం. ఫెడరల్‌ అథారిటీ ఆఫ్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిసన్‌ షిప్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉచిత వీసా 18 ఏళ్ళ లోపు డిపెండెంట్స్‌కి మాత్రమే. జులై 15 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ప్రతి యేడాదీ ఈ ఉచిత వీసా సౌకర్యం అందుబాటులో వుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈ క్యాబినెట్‌ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. కాగా, 497 దిర్హామ్‌ల ఖర్చుతో 14 రోజుల ఎక్స్‌ప్రెస్‌ టూరిస్ట్‌ వీసా, 917 దిర్హామ్‌ల ఖర్చుతో 30 రోజుల మల్టీ ఎంట్రీ టూరిస్ట్‌ వీసాలను ఆన్‌లైన్‌ ద్వారా పొందితే పొందవచ్చు. ఇదిలా వుంటే, ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఇప్పటిదాకా దేశంలోని ఎయిర్‌పోర్ట్‌ల నుంచి 32.8 మిలియన్‌ మంది ప్రయానించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క, యూఏఈలో నివసిస్తున్న పేరెంట్స్‌, సెకెండరీ లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసుకున్న 18 ఏళ్ళు నిండిన తమ డిపెండ్స్‌ కోసం 1 ఏడాది రెసిడెన్సీ ఎక్స్‌టెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్స్‌ని ఈ మేరకు సమర్పించాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com