తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్‌ మెయిడ్‌

- June 22, 2019 , by Maagulf
తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్‌ మెయిడ్‌

కువైట్‌: తప్పించుకునే ప్రయత్నంలో ఓ మెయిడ్‌ గాయపడిన ఘటన హవాలిలో చోటు చేసుకుంది. మూడో ఫ్లోర్‌ నుంచి ఆ మెయిడ్‌ కింద పడటంతో, కాలికి తీవ్ర గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్స్‌తో బాధపడుతున్న ఆ మెయిడ్‌కి ముబారక్‌ అల్‌ కబీర్‌ ఆసుపత్రిలో వైద్యం అందుతోందనీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. డొమెస్టిక్‌ వర్కర్స్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ నుంచి ఆ మెయిడ్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా మాత్రం తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ, మెయిడ్‌ అలా పారిపోయేందుకు ప్రయత్నించడానికి కారణాలేంటో అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com