దుబాయ్:'PBSK' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

- June 22, 2019 , by Maagulf
దుబాయ్:'PBSK' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

దుబాయ్:దుబాయ్ లోని 'PBSK' ఆధ్వర్యంలో  లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.దల్స్కో వర్కర్స్ క్యాంపులో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

హర్జీత్ సింగ్ (వైస్ కౌన్సులర్-ఇండియన్ కాన్సులెట్) ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.హర్జీత్ సింగ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్‌ సపోర్టర్‌ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్‌ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్టిన్ వర్డ్ (ఫైనాన్సియల్ కౌన్సిలర్),కుసుమ్ దత్త (సోషల్ వర్కర్),అంజిత్(PBSK ఎగ్జిక్యూటివ్ ) మరియు యాస్టర్ హెల్త్ కేర్ టీం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం కార్మికులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.

--హరి (మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com