పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను సైబరాబాద్ పోలీసులు వాడేసుకున్నారుగా..!!
- June 22, 2019
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భాగంగా భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన క్రికెట్ అభిమానులు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పటికే అతడి కెప్టెన్సీని, పాక్ క్రికెటర్ల ఆటతీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కూడా సర్ఫరాజ్ ఫోటోని వాడేసుకున్నారు. ఇటీవల జరిగన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ ఫోటోని ఆధారంగా చేసుకుని సైబరాబాద్ పోలీసులు.. ”నిద్ర వస్తున్నా.. ఆపుకుని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్” అని కామెంట్ పెట్టారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ఫోటో చూసి.. సైబరాబాద్ పోలీసుల సెన్సాఫ్ హ్యూమర్‌ని మెచ్చుకుంటున్నారు. సెభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..