యు.ఏ.ఈ సందర్సన వీసా పొడగింపు ఇక సులభతరం
- January 04, 2016
సందర్సన వీసాతో యు.ఏ.ఈ వెళ్ళిన పర్యాటకులు వీసా కాల పరిమితి ముగిసినపుడు ఇకపై ఆందోళన చెందనవసరం లేదు. 570 దినార్ల వ్యయంతో సందర్సన వీసాను పోడుగించుకొనే అవకాశం ఉందని అధికారులు సమాచారం తెలియచేస్తున్నారు. అయెతే , యు.ఏ.ఇ. సందర్సన వీసా గడువు మరో నెలరోజుల్లోముగియబోతున్న వ్యaవధిలో మాత్రమె పర్యాటకులు పొడగించుకొనే అవకాశం ఉంది. గతంలో సందర్సన వీసా ద్వారా యు.ఏ.ఇ.కు వచ్చిన పర్యాటకులు వారి కాల పరిమితి పూర్తి కాబడినపుడు విధిగా తమ తమ దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానే , నేడు కల్పించిన సదుపాయంతో సందర్సన వీసాకు డబ్బు చెల్లించి అదనంగా నెల రోజుల కాలాన్ని పోడుగించుకొనే అవకాశం ఏర్పడింది. ఈ సదుపాయం కొత్తదేమీ కాదని, 2004 లో 337 వ నిర్ణయం లో ఉండేదని , అదే విధానంను తిరిగి అమల్లోనికి తీసుకొస్తున్నట్లు అంతరంగిక యు.ఏ.ఇ. మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ డాక్టర్ రషీద్ సుల్తాన్ తెలిపారు. వీసా కాలం ముగేసే లోపు అన్ని సంస్థలు మరియు సందర్శకులు వలస వెళ్ళేందుకు వీలు కల్పించే కార్యాలయంలో సందర్శన వీసా పొడగింపు పత్రాలను అందచేయవచ్చు. అధికారిక కొత్త నియమలన్ని ఈ ప్రవేశ అనుమతులకు వర్తిస్థాయి . ఈ అనుమతుల విసాలలో దీర్ఘ కాల సందర్శన ( 90రోజులు ) , స్వల్ప కాల సందర్శన ( 30 రోజులు ) , విద్యార్ధి వీసాలు, వైద్య చికిత్స మరియు నివాశ వీసాలు ఉన్నాయి. ఈ వీసాల ప్రక్రియలో ఆధునిక ఎలెక్ట్రోనిక్ విధానంతో పకడ్బందిగా రూపొందించనున్నారు. కనుక ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదని ఆయన చెప్పారు. కాగా, నూతనంగా పునరుద్దరించబడిన సందర్సన వీసా పొడగింపు నిబంధన పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









