అది హత్య కాదు, ఆత్మహత్య మాత్రమే

- June 26, 2019 , by Maagulf
అది హత్య కాదు, ఆత్మహత్య మాత్రమే

కువైట్: ఖైతాన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి పోలీస్‌ అధికారులు ప్రాథమికంగా కొన్ని విషయాల్ని వెల్లడించారు. అతనిది హత్య కాదనీ, ఆత్మహత్య అని తెలిపారు పోలీసులు. మెడ మీద గాయంతో భారతీయ వలసదారుడొకరు పడి వుండడాన్ని పోలీసులు కనుగొన్నారు. తనంతట తానుగానే ఆ వ్యక్తి తన గొంతు కోసుకున్నాడని, బెడ్రూమ్‌ నుంచి బయటకు వచ్చి రక్తపు మడుగులో నేలకొరిగాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com