దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: బస్‌ డ్రైవర్‌ కోసం లాయర్‌ ఏర్పాటు

- June 28, 2019 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: బస్‌ డ్రైవర్‌ కోసం లాయర్‌ ఏర్పాటు

మస్కట్‌: దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అబుదాబీలోని ఒమన్‌ ఎంబసీ, డ్రైవర్‌ తరఫున లాయర్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మవసలాత్‌కి చెందిన బస్సు అతి వేగంతో ఓ హైట్‌ బ్యారియర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే. ఏడేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీగా బ్లడ్‌ మనీని కూడా న్యాయస్థానం డ్రైవర్‌పై విధించింది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్‌ తరఫున లాయర్‌ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com