రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇరాకీ మహిళల అరెస్ట్
- June 28, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఇద్దరు ఇరాకీ మహిళల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యూటీ పార్లర్లో మహిళ వుండగా, ఆమె వెంట వచ్చిన రెండేళ్ళ చిన్నారిని నిందితులు కిడ్నాప్ చేశారు. కైరావాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తన ఆంటీతో కలిసి బ్యూటీ పార్లర్‌కి రావడం జరిగిందనీ, చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించిన వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, విచారణ చేపట్టిన అధికారులకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుల జాడ దొరికిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలిసినవారే ఈ కిడ్నాప్‌కి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!