హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్స్ ముఠా పట్టివేత
- July 02, 2019
హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఫారెన్ కి చెందిన ఇద్దరు ప్రేమికులు డ్రగ్స్ ను సరఫరా చేస్తూ… ఎక్సైజ్ ఎన్ ఫొర్స్ మెంట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్ కు గత కొంత కాలంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్ని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ లో వందలాది డ్రగ్స్ ముఠాలు యదేచ్ఛగా దందా చేస్తున్నాయి. నగరంలో డ్రగ్స్ కి భారీ గిరాకీ ఉండడంతో విదేశీయులు కూడా దేశంలో తిష్ట వేసి… హైదరాబాద్ కు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా మరో ఫారెన్ లవర్స్ డ్రగ్స్ ముఠా ఎక్సైజ్ అధికారులకు దొరికారు.
మెడికల్ వీసాపై బెంగళూర్ వచ్చిన ప్రేమజంట ఎబుకా,అమినాట డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఇతర దేశాల నుంచి మత్తు పదార్ధాలను సముద్ర మార్గం ద్వారా భారత్‌కు తీసుకువస్తున్నారు. బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు తరలించి నగరంలో ఒక్కో గ్రామ్ కోకైన్ 7 వేల నుంచి 10 వేల వరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొంతకాలంగా ఎబుకా ముఠా డ్రగ్స్ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అయితే డ్రగ్స్ పై నిఘా పెట్టిన అధికారులు…. ఇటీవల ఎబుకా అనుచరులను పట్టుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ ప్రధాన లీడర్ ఎబుకాతోపాటు అతని లవర్ ని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 106 గ్రాముల కోకైన్, నాలుగు సెల్ పోన్లు, ఒక బైక్, 70 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
అయితే ఇటీవల డ్రగ్స్ ముఠాలలో ప్రేమికులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇటీవల పిల్మ్ నగర్ లో ఓ ప్రేమ జంట డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన సంఘటన మరువకముందే తాజాగా ఈ ప్రేమ జంట దొరికింది. దీంతో పోలీసులు పబ్ లు, క్లబ్ లు, హోటల్స్ లపై మరింత నిఘా పెట్టారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!