ఇక్కడ నివసిస్తే నెలకు రూ. 40,000..
- July 04, 2019
గ్రీస్:మా ద్వీపానికి వస్తే రూ.40 వేలు ఇస్తామంటున్నారు అంటీకైథెరా ద్వీపానికి చెందిన మేయర్. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో నివసించే వారికి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ద్వీపం కనుమరుగైపోతుంది. ద్వీప అందాలను కాపాడుకోవాలంటే జనం సంచారం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవి కాలం వస్తే ద్వీపాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది కానీ మాములు రోజుల్లో అయితే మనుషులే కనిపించరు.
మధ్యధరా సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య ఉన్న అంటీకైథెరా ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ద్వీప అందాలు పర్యాటకులను మైమరపిస్తాయని ద్వీప మేయర్ ఆండ్రియాస్ చార్చలకిస్ గ్రీకు వెబ్‌సైట్‌కు చెప్పారు. ద్వీపంలో నివసించే వారి సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ ద్వీపంలో నివసించడానికి ఎవరైనా ఆసక్తి చూపితే ఇక్కడ ఉంటున్నందుకు వారికి నెలకు 450 పౌండ్లు (రూ.40 వేలు) చెల్లిస్తామంటోంది గ్రీస్ దేశం. ద్వీపాన్ని కాపాడుకోవాలని, దానికి పునర్వైభవాన్ని తీసుకు రావాలనే వారి ప్రయత్నం అభినందనీయం అంటూ పలువురు గ్రీస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!