దుబాయ్:అష్టకష్టాలు పడుతున్న తెలుగు మహిళ
- July 06, 2019
దుబాయ్:దుబాయ్‌లో అష్టకష్టాలు పడుతున్న ఓ తెలుగు మహిళ తనను కాపాడమని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. తాను అక్కడ పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ బాధితురాలు కన్నీటి పర్యంతం అవుతోంది. సోషల్‌మీడియాలో బాధితురాలు సమీనా.. పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కుల్కచర్ల మండల కేంద్రాననికి చెందిన 23 ఏళ్ల సమీన.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన మూడేళ్లకు వారి బాబు పుట్టాడు. అయితే ఆ బాబుకు జీర్ణ సంబంధిత వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అవ్వడంతో.. సమీనాను వదిలి వెళ్లిపోయాడు భర్త. దీంతో ఒక్కసారిగా ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి..
కొన్ని రోజులు పాటు ఇళ్లలో పాచిపనులు చేస్తూ.. జీవితం నెట్టుకొచ్చినా.. కొడుకు అనారోగ్యం నయం చేయడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడేది. దీంతో తెలిసిన వాళ్లు కొందరు దుబాయ్‌లో పని ఉందని చెప్పడంతో.. అవకాశాన్ని వదులుకోలేక తన కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లాక ఓ దుబాయ్ షేక్ ఇంట్లో పనికి కుదిర్చి ఏజెంట్ చేతులుదులుపుకున్నాడు.
ఉద్యోగంలో చేరి మూడు నెలలు అయినా షేక్ డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. శారీరకంగా మానసికంగా వేధించసాగాడు. పోని ఏదోలా తిరిగి భారత్‌కు వచ్చేదమంటే అప్పటిక పాస్‌పోర్టును ఏజెంట్ లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా అక్కడి నుంచి తప్పించుకుని.. వేరే దగ్గర పనికి కుదిరినా అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో గత మూడు నెలలుగా తాను అనుభవిస్తున్న నరకయాతనను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పెట్టింది. ప్రభుత్వం ఆదుకుని తనను ఎలాగైనా తన కొడుకు దగ్గరకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.ఈ విషయం పై కె.టి.ఆర్ స్పందిస్తూ యూ.ఏ.ఈ ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరిని తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!