'ముత్యాలముగ్గు' లో నచ్చిన పాట
- July 06, 2019ముత్యాలముగ్గు. బాపు-రమణల రూపకల్పనలో కథా కథన సంవిధానం వినూత్నపంథాలో నడిచింది. కథకి సంభాషణలు, సన్నివేశాలు ఒకతీరైతే, ఇందలి పాత్రలు ఇంకొక తీరై మొదట్లో సామాన్య ప్రేక్షకుడి నాడికి అందలేదు. ఆ తర్వాత మక్కువ ఏర్పడి బాపు-రమణల కృషిని ఇనుమడింప చేశారు. శతాధిక చిత్రాలవైపు దూసుకెళ్లి, ఆర్థికంగా నిర్మాతలను అబ్బురపర్చింది.
కథాంశానికి వస్తే రామాయణానికి రావణాబ్రహ్మ ప్రతినాయకుడైతే, ఈ చిత్రానికి నాయకుడు, ప్రతి నాయకుడు రావు గోపాలరావు. కాంట్రాక్టర్ పాత్రలో తనదైన ముద్రవేశాడు. ఈ చిత్రంతో మడమ తిప్పని మహానటుడై.. ఆయన ఆడింది మాట, చేసింది పాత్ర అయ్యింది తెలుగు సినీ పరిశ్రమలో. ఇక సూర్యకాంతం పాత్ర బహు సాత్వికం (అప్పటి వరకూ ఆమె చేసిన పాత్రలకు విరుద్ధం). శ్రీ్ధర్, సంగీత కథానాయకా నాయికలు. అల్లు రామలింగయ్య పాత్రకి ఆనాటి కథానాయకుడులో పాత్ర తరువాత అంత బ్రేకువచ్చింది. నూతన్‌ప్రసాద్ అంటే తెలిసొచ్చింది తెలుగు ప్రజలకి. తర్వాత ఆయన కూడా మడమతిప్పని రీతిలో ఎదిగిపోయారు. కథాంశానికి వెళ్తే...
విలన్ రావుగోపాలరావు. ఆ పాత్ర చుట్టూరా అల్లురామలింగయ్య, నర్తకి, కాంతారావు, ముక్కామల, కాకరాల తదితర అతిరథ మహారథులు తారా పల్లకినలంకరించారు. విలన్ మేనరిజం -ఎదురు తిరిగితే డిక్కీలో తొంగోపెట్టడం, డబ్బు సంపాదించడం. అలా విడదీయబడిన జంట శ్రీధర్, సంగీతలు- చివరాకరికి విలన్ ఆడిన డ్రామానే రివర్స్చేసి అతనికి కనువిప్పు కలిగించి కథను సుఖాంతం చేయడంలో బాపూ రమణలు కృతకృత్యులై నిర్మాతలకి, బ్యానర్‌కి ప్రశంసలు, పైకం కురిపించారు. జనాన్ని మురిపించారు. ఈ చిత్రానికి పాటలు, మాటలు మంచిగా నప్పాయి. జన బాహుళ్యపు హృదయాంతరాలకు చొచ్చుకుపోయాయి. కొన్ని పాటల్ని గుర్తు చేసుకుంటే, -ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ/ గోగులు పూచే గోగులు పూచె/ నిదురించే తోటలోకి../ శ్రీరామ నీ నామం బహుతీపి/ ఏదో ఏదో అన్నది/ ఎంతటి రసికుడవో/ శ్రీరామ జయరామ. గీత రచయితలు సి నారాయణరెడ్డి, ఆరుద్ర మరియు సినిమా రచనలో నూతనంగా కురిసిన కలం గుంటూరు శేషేంద్రశర్మ. గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలమ్మ, రామకృష్ణ, కె.వి.మహదేవన్ సంగీత సారథ్యంలో పాటల్ని ప్రేక్షక రసహృదయాలకు చేరువచేశారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద జాతీయ అవార్డు, సినిమాటోగ్రఫీకి మరో అవార్డు లభించింది. చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఇంతటి కృషికి, ప్రశంసలకి ఆద్యుడు నిర్మాత మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు మూలస్థానంలో ఉన్నారు. అందరికీ ఇష్టమయ్యే చిత్రం -ముత్యాలముగ్గు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..