SBI గుడ్‌న్యూస్: హోమ్ లోన్స్ మరింత చౌక, వడ్డీ రేటు తగ్గింపు
- July 10, 2019
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ కేలండర్ ఇయర్లో వరుసగా మూడుసార్లు రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. 25 బేసిక్ పాయింట్ల చొప్పున మూడుసార్లు మొత్తం 6.50 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గించింది. ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని ఆర్బీఐ.. బ్యాంకులకు స్పష్టం చేసింది. అంతేకాదు, ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు ఆశించినట్లుగా అందివ్వడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసారు.
హోమ్, వెహికిల్ లోన్ తీసుకునే వారికి తగ్గనున్న భారం
ఈ నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 బేసిక్ పాయింట్ల మేర తగ్గిస్తూ, ఈ కొత్త వడ్డీ రేట్లు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకునే వారికి కాస్త భారం తగ్గనుంది.
అన్ని కాలపరిమితుల రుణాలకు MCLR అనుసంధానం
ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) లేదా కనీస రుణ రేటును 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలకు ఈ MCLR అనుసంధానం అవుతుందని పేర్కొంది. ఈ తగ్గింపు వర్తిస్తుందని చెప్పింది.
ఎస్బీఐ తగ్గింపు మూడోసారి
ఈ నెల 1వ తేదీ నుంచి రెపో ఆధారిత హోమ్ లోన్స్‌ను ఎస్బీఐ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆర్బీఐ వరుస కోతల నడుమ 20 బేసిస్ పాయింట్ల మేర హోమ్ లోన్స్ వడ్డీరేట్లను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది మూడోసారి. ఏప్రిల్, మే నెలల్లోను వడ్డీ రేట్లను 0.05 శాతం చొప్పున తగ్గించింది. ఈ కాలంలో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు 0.20 శాతం (20 బేసిక్ పాయింట్స్) తగ్గాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!