ఇండియన్‌ బిజినెస్‌మేన్‌కి అజ్మన్‌లో తొలి గోల్డ్‌ కార్డ్‌

- July 10, 2019 , by Maagulf
ఇండియన్‌ బిజినెస్‌మేన్‌కి  అజ్మన్‌లో తొలి గోల్డ్‌ కార్డ్‌

అజ్మన్‌ ఎమిరేట్‌, తొలి గోల్డ్‌ కార్డ్‌ వీసాని నెస్టో గ్రూప్‌ డైరెక్టర్‌ సిద్దిఖీ పల్లోలాథిల్‌కి జారీ చేసింది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ - అజమ్మన్‌ ఈ తొలి గోల్డ్‌ కార్డ్‌ని జారీ చేయడం జరిగింది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ ఎఫైర్స్‌ - జిడిఆర్‌ఎఫ్‌ఎ అజ్మన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహ్మద్‌ అబ్దుల్లా అల్వాన్‌ ఈ గోల్డ్‌ కార్డుని నెస్టో గ్రూప్‌ డైరెక్టర్‌కి అందజేశారు. పెట్టుబడిదారులకు మరింత భద్రత కల్పించేందుకు, ఇన్వెస్టిమెంట్స్‌ని ఇంకా ఎక్కువగా రప్పించేందుకు ఈ గోల్డ్‌ కార్డ్‌ ప్రక్రియ ఉపయోగపడ్తుందని బ్రిగేడియర్‌ అల్వాన్‌ చెప్పారు. స్పాన్సర్‌ లేకుండా రెసిడెన్సీ వీసా పొందడం సహా అనేక సౌకర్యాలు ఈ గోల్డ్‌ కార్డ్‌ వీసా వున్నవారికి లభిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com