కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య

కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య

మస్కట్‌: ఇద్దరు సోదరుల్ని వారి కజిన్‌ కాల్చి చంపిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. విలాయత్‌ ఆఫ్‌ ముస్నాహ్‌లో ఈ ఘటన జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని అధికారులు వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరగగా, ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో వుందనీ, హత్య ఎందుకు జరిగింది.? అన్నదానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

 

Back to Top