మంగళవారం కతార్‌లో పాక్షిక గ్రహణం కన్పించే అవకాశం

మంగళవారం కతార్‌లో పాక్షిక గ్రహణం కన్పించే అవకాశం

దోహా: జులై 17న ఖతార్‌ రెసిడెంట్స్‌ పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూసేందుకు వీలుంది. చంద్రగ్రహణం పూర్తిగా కన్పించే సమయానికి కేవలం 65.3 శాతం మాత్రమే కన్పిస్తుంది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే స్ట్రెయిట్‌ లైన్‌ మీదికి రావడం ద్వారా చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆసియా, యూరోప్‌, ఆఫ్రికా, సౌత్‌ అమెరికా, నార్త్‌ అమెరికా దేశాల్లోనూ ఈ చంద్రగ్రహణం కన్పించే అవకాశం వుంది. ఖతార్‌లో మొత్తం 5 గంటల 35 నిమిషాల సమయం వరకు ఈ చంద్రగ్రహణం కన్పించవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం తెల్లవారు ఝామున 3.18 నిమిషాలకు ముగుస్తుంది.  

 

Back to Top