75 శాతం డిస్కౌంట్‌: షార్జా సమ్మర్‌ ప్రమోషన్స్‌ ప్రారంభం

75 శాతం డిస్కౌంట్‌: షార్జా సమ్మర్‌ ప్రమోషన్స్‌ ప్రారంభం

జులై 14 నుంచి షార్జా సమ్మర్‌ ప్రమోషన్స్‌ ప్రారంభమయ్యాయి. మొత్తం 49 రోజులపాటు ఈ మెగా ఈవెంట్‌ జరుగుతుంది. సార్జా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎస్‌సిసిఐ), షార్జా కామర్స్‌ అండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నాయి.ఎస్‌సిసిఐ డైరెక్టర్‌ జనరల& మొహమ్మద్‌ అహ్మద్‌ అమిన్‌ అల్‌ అవది మాట్లాడుతూ, టూరిజంని వృద్ధి చేసే క్రమంలో ఈ స్పెషల్‌ సేల్‌ ఎంతో ఉపకరిస్తుందనీ, 75 శాతం వరకు డిస్కౌంట్లు ఈ సేల్‌ ప్రత్యేకత అని చెప్పారు. షాపింగ్‌, ఫ్యామిలీ టూరిజం మరియు హోటల్స్‌ సెక్టార్‌లో ఈ ఈవెంట్‌ కొత్త ఉత్సాహం తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా వున్నవారినేకాక, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన టూరిస్టుల్ని ఈ ఫెస్టివల్‌ విశేషంగా ఆకర్షించనుంది. 

Back to Top