శెభాష్ మేరిన్ జోసెఫ్.. సునీల్ సౌదీ పారిపోయినా..
- July 21, 2019
కోర్టు మెట్లు.. హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదంటారు పెద్దలు. నిజమేనేమో.. కోర్టుల్లో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ సంవత్సరాలు గడిచిపోతాయి. తీర్పు వచ్చేదెన్నడో బాధితులకు న్యాయం జరిగెదెన్నడో.. కేసు వేసి కోర్టు చుట్టూ తిరగాల్సిందే. ఇక ఆసుపత్రుల విషయానికి వస్తే జబ్బు తగ్గేదేమో కానీ ఇల్లూ, ఒళ్లూ రెండూ గుల్ల అవ్వాల్సిందే. కానీ అనూహ్యంగా 2017లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన తీర్పు రెండేళ్లలోనే ముగిసిందంటే మామూలు విషయం కాదు. అందుకు అభినందించాల్సింది ఐపీఎస్ అధికారిణి అయిన కొల్లం పోలీసు కమిషనర్ మేరిన్ జోసెఫ్ని. కేరళ రాష్ట్రంలోని కొల్లెం నగరానికి చెందిన సునీల్ కుమార్ 2017లో 13 ఏళ్ల బాలికపై మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. విషయం బయటకు పొక్కడంతో సునీల్ సౌదీకి పారిపోయాడు. అత్యాచార బాధితురాలిని ప్రభుత్వ బాలికల సదనానికి తరలించారు. అక్కడకు వెళ్లిన కొన్ని రోజులకే బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలికను సునీల్‌కి పరిచయం చేసిన బాబాయి.. ఇంతటి ఘోరానికి తనే కారణమని భావించి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఫైల్ చేసిన ఈ కేసు కాస్తా పెండిగులో ఉండిపోయింది. నిందితుడు సునీల్ సౌదీలో ఉండడంతో అతడిని అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కొల్లం పోలీస్ కమిషనరుగా కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారిణి మేరిన్ జోసెఫ్ పెండింగ్‌లో ఉన్న ఈ కేసును చూసి స్పందించారు. దీనిపై దర్యాప్తుకు సిబ్బందిని అలర్ట్ చేశారు. నిందితుడు సౌదీలో ఉండడంతో సీబీఐ ద్వారా ఆ దేశానికి లేఖ రాయించారు. ఆమే స్వయంగా రియాద్ వెళ్లి ఇంటర్ పోల్, భారత రాయబార కార్యాలయాలకు సమాచారం అందించి సౌదీ పోలీసుల సాయంతో నిందితుడు సునీల్‌ను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకువచ్చారు. కేసును ఇంత త్వరగా పరిష్కరించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఐపీఎస్ అధికారిణి మేరిన్ జోసెఫ్ని కేరళ ప్రజలంతా ప్రశంసించారు. కేసులో బాధితురాలు మరణించినా, నిదింతుడు విదేశాల్లో ఉన్నా అతడిని అరెస్టు చేసిన ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..