ఇల్లీగల్ హజ్ కారవాన్స్: ఏడాది జైలు శిక్ష
- July 24, 2019
కువైట్ సిటీ: అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - మీడియా అండ్ ఫారిన్ రిలేషన్స్ - మినిస్ట్రీ ఆఫ్ అవ్‌కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ - మొహమ్మద్ అల్ ముతైరి, అన్ అథరైజ్డ్ హజ్ కారవాన్స్‌పై హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా కారవాన్లను నిర్వహిస్తే, ఏడాది జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 50,000 కువైటీ దినార్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందనీ ఆయన తెలిపారు. హజ్ కారవాన్స్‌కి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు అల్ ముటైరి. మినిస్ట్రీ అలాగే కారవాన్స్, ఫిలిగ్రిమ్స్‌కి మంచి సేవలు అందించే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నాయనీ, ఇందులో అక్రమాలకు తావు లేకుండా వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు ముందు కార్యాలయాల్లో మరింతగా తనిఖీలు జరుగుతాయనీ, రానున్న సీజన్‌లో ఫిలిగ్రిమ్స్‌కి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తామనీ అల్ ముటైరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!