వెదర్ రిపోర్ట్: ఒమన్ నార్తరన్ పార్ట్స్‌లో వర్షం
- July 25, 2019
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో క్యుములస్ క్లౌడ్స్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. మూడు రోజులపాటు ఈ వర్షాలు కురుస్తాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. అల్ హజార్ మరియు సమీప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనని సివిల్ ఏవియేషన్ పేర్కొంది. భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు కూడా వుంటాయని తెలిపింది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్. దోఫార్ గవర్నరేట్ పరిధలోనూ, సమీపంలోని మౌంటెయిన్స్‌లో కూడా వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతమయి వుంటుందనీ, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయనీ అధికారులు వెల్లడించారు. మస్కట్ గవర్నరేట్‌లో 39 డిగ్రీలు, సలాలాలో 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అ్యధికంగా అల్ బురైమిలో 43 డిగ్రీలు వుండొచ్చు. అత్యల్పంగా షామ్స్ మౌంటెయిన్‌లో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..