సమ్మర్‌ డిస్కౌంట్స్‌ని ప్రకటించిన ఎమిరేట్స్‌

- July 25, 2019 , by Maagulf
సమ్మర్‌ డిస్కౌంట్స్‌ని ప్రకటించిన ఎమిరేట్స్‌

దుబాయ్‌: సమ్మర్‌ జర్నీని కూల్‌గా మార్చేందుకు ఎమిరేట్స్‌, అద్భుతమైన డిస్కౌంట్స్‌తో ప్రత్యేక ఎయిర్‌ ఫేర్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. యూరోప్‌ మరియు మిడిల్‌ ఈస్ట్‌లోని మేజర్‌ డెస్టినేషన్స్‌కి ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. జులై 22 నుంచి ఆగస్ట్‌ 4 వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవారు 2020 ఏప్రిల్‌ 30 వరకు ప్రయాణించే వీలుంది. ఎమిరేట్స్‌ ప్రయాణీకులకు రీజినల్లీ ఇన్‌స్పైర్డ్‌ మీల్స్‌, 4,000 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ - అవార్డ్‌ విన్నింగ్‌ ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌, 20 ఎంబీ కాంప్లిమెంటరీ వైఫైని అన్ని క్లాసుల్లోనూ పొందవచ్చు. మరోపక్క ఎమిరేట్స్‌ ప్రయాణీకులకు హోమ్‌ చెక్‌ ఇన్‌ సర్వీస్‌ కూడా అందుబాటులో వుంది. అన్ని క్లాసుల ప్రయాణీకులకూ ఈ సర్వీస్‌ వర్తిస్తుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com