యూఏఈలో ఎమిరేట్స్‌ ఐడీ వార్నింగ్‌

- July 26, 2019 , by Maagulf
యూఏఈలో ఎమిరేట్స్‌ ఐడీ వార్నింగ్‌

యూఏఈ ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌, రెసిడెంట్స్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫ్రాడ్‌స్టర్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎమిరేట్స్‌ ఐడీ హోల్డర్స్‌ ఎవరూ తమ వ్యక్తిగత వివరాల్ని, బ్యాంక్‌ వివరాల్ని ఫోన్‌ ద్వారా ఎవరికీ అందజేయకూడదని డిపార్ట్‌మెంట్‌ తరఫున నోటీస్‌లో స్పష్టం చేశారు. ఫోన్‌ ద్వారాగానీ, ఇ-మెయిల్‌ ద్వారాగానీ వివరాల్ని షేర్‌ చేస్తే ఫ్రాడ్‌స్టర్స్‌ చేతికి చిక్కినట్లే అవుతుందని హెచ్చరించారు. టెలిఫోన్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా అథారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిడెంట్స్‌ వ్యక్తిగత వివరాల్ని కోరబోదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఫ్రాడ్‌స్టర్స్‌ విషయమై ఎలాంటి సమాచారం వున్నా, సోషల్‌ మీడియా ఛానల్స్‌ ద్వారా లేదా టెలిఫోన్‌ ద్వారా డిపార్ట్‌మెంట్‌కి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com