మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా

- July 26, 2019 , by Maagulf
మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా

ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రెండు స్వల్పశ్రేణి మిసైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. వోన్‌స‌న్ పట్టణంలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 430 కిలోమీట‌ర్లు ప్రయాణించిన మిస్సైళ్లు.. తూర్పు సముద్రంలో ప‌డిన‌ట్లు సమాచారం. ఐతే, ఆ క్షిపణులు జపాన్ జలాల్లోకి రాలేదని జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వ‌చ్చేనెల‌లో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైనిక ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా-దక్షిణ తీరుపై మండిపడుతున్న నార్త్ కొరియా, మిసైల్ పరీక్షలకు దిగింది. ఆ జంట మిస్సైళ్లు K.N-23S అయి ఉంటాయ‌ని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. K.N-23S క్షిపణులు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగలవని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com