లిబియాలో దారుణం..150 మృతి!
- July 26, 2019
లిబియా:లిబియా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఉగ్రవాదం.. ఆకలి కేకలు, అంతర్గత పోరు కేరాఫ్ అడ్రస్. అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక గడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల వల్ల ఎంతో ప్రాణాలు హరిస్తున్నాయి. చాలా మంది ఆ దేశంలో ఉండలేక వివిధ ప్రదేశాలకు వలస వెళ్లడం గమనిస్తూనే ఉన్నాం.
బతుకు దెరువు కోసం వలసబాట పట్టిన లిబియా వాసుల పడవ ప్రయాణం మరోమారు విషాదాంతమైంది. పొట్టచేత పట్టుకుని వలసబాట పడుతున్న లిబియన్లు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లిబియా నుంచి యూరప్‌కు 250 మందితో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 150 మంది నీటిలో మునిగి చనిపోయారు..145 మందిని రక్షించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. తాజాగా లిబియాలో ఇప్పటి వరకు జరిగిన పడవ ప్రయాణాల్లో 2,297 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. తమ ప్రాణాలు లిబియాలోనే పోతున్నాయనుకుంటే...ఇలాంటి ప్రమాదాల వల్ల కూడా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..