బోనాల సంబరాలతో వెలిగిపోతోన్న హైదరాబాద్
- July 28, 2019హైదరాబాద్:బోనాల సంబరాలతో భాగ్యనగరం వెలిగిపోతోంది.. పాతబస్తీ ఆధ్మాత్మికశోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ బోనాల జాతర సందడిగా సాగుతోంది. సింహవాహినిగా వేంచేసిన మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.. భక్తుల మొక్కులు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో పాతనగరం సందడిగా మారింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు..
అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు అన్ని చోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. అటు రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవానీ రథయాత్ర జరుగుతుంది.. మరోవైపు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు.. ఓల్డ్ సిటీలో బోనాలకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు