సౌదీ అరేబియా:'ఎబోలా' భయంతో వీసాలు రద్దు
- July 29, 2019
రియాద్: కాంగో దేశంలో 'ఎబోలా వైరస్' వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంతో ఆ దేశానికి చెందిన హజ్ యాత్రికుల వీసాలను రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా నిర్ణయించింది. కాంగోలోని కీవు, ఇటూరి ప్రాంతాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందని ఈ ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్యూఎచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ దాదాపు 1700 మంది మరణించినట్టు కాంగో ఆర్యోగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంలోనే వచ్చే నెలలో సౌదీ అరేబియాలో జరిగే హజ్యాత్రను సందర్శించడానికి కాంగోలోని చాలామంది ముస్లింలు హజ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశీయులు రావడం వల్ల ఇతర దేశ యాత్రికులు ఎలోబా వైరస్ó సోకే ప్రమాదముందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ విదేశాంగ మంత్రి అల్ జాజీరా తెలిపారు. కాంగో సహా గునియా, సియార్రాలీన్ , లిబిరియా దేశాలకు చెందిన యాత్రికుల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనూ పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్వ్యాప్తి చెంది దాదాపు 11వేల మంది చనిపోయిన సందర్భంలో ఆ దేశీయుల వీసాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..