హజ్ సీజన్: గల్ఫ్ ఎయిర్ అదనపు విమానాలు
- July 29, 2019
బహ్రెయిన్ కింగ్డమ్ నేషనల్ కెరియర్ గల్ఫ్ ఎయిర్, హజ్ సీజన్ నేపథ్యంలో 28 జులై నుంచి రెగ్యులర్‌గా అదనపు విమానాల్ని సౌదీ అరేబియాలోని మక్కా మరియు మదీనాలకు నడపనున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ ఎయిర్ రెగ్యులర్‌గా మూడు నుంచి నాలుగు విమానాల్ని జెడ్డాకి, ఏడు విమానాల్ని మదీనాకి నడుపుతుండగా, అదనంగా మరికొన్ని విమానాల్ని హజ్ సీజన్ కోసం నడపనున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ ఎయిర్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ వలీద్ అబ్దుల్ హమీద్ అల్ అల్వారి మాట్లాడుతూ, ప్రతి యేడాదీ జెడ్డా మరియు మదీనాలకు విమానాల సంఖ్యను హజ్ సీజన్లో పెంచుతున్నట్లు చెప్పారు. డిమాండ్‌కి తగ్గట్టుగా ప్రత్యేక విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నామనీ, యాత్రీకులు సేఫ్‌గా తమ హజ్ యాత్రను ముగించుకుని రావడానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. బహ్రెయిన్ ఇంటర్నేసనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..