13 ఏళ్ళ బాలిక బలవన్మరణం
- August 01, 2019యూఏఈలో 13 ఏళ్ళ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మృతురాల్ని గల్ఫ్ జాతీయురాలిగా గుర్తించారు. షార్జాలోని అల్ రమ్తా ఏరియాలోని తన ఇంట్లో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ఆమె మరణించింది. బాలికను రక్షించేందుకు చాలా శ్రమించామనీ, ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు వైద్యులు. బ్లాక్ స్కార్ఫ్‌ని మెడకు చుట్టుకుని, బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తొలుత కనుగొన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిందామె. మృతదేహంపై వేరే ఎలాంటి గాయాలూ లేవని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా