NDTV జర్నలిస్టు రవిష్ కుమార్ కు రామన్ మెగసేసే అవార్డు
- August 02, 2019
ఇండియన్ జర్నలిస్ట్ రవిష్ కుమార్‌కు రామన్ మెగసేసే అవార్డు దక్కింది. జర్నలిజం రంగంలో అద్భుత సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును ఇస్తారు. ఈ ఏడాది మొత్తం 5మందికి ఈ అవార్డును ప్రకటించారు. ఆసియా నోబెల్ బహుమతిగా భావించే మెగస్సేసే అవార్డు NDTV జర్నలిస్టు రవిష్ కుమార్ ను వరించడం విశేషం.
ఈ అవార్డు గెలిచిన మిగితా వారిలో మయన్మార్‌కు చెందిన జర్నలిస్టు కో స్వీ విన్, థాయిలాండ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అంగ్ఖానా నీలాపాజిత్, పిలిప్పీన్స్కు చెందిన సంగీతకారుడు రాముండో పూజంటే కాయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ కీలు ఉన్నారు. హింస, మానసిక సమస్యల గురించి కిమ్ పరిశోధనలు చేస్తున్నారు.
రవీష్ కుమార్ కి 2019 రామన్ మెగస్సేసే అవార్డు వచ్చినట్లు తెలిసి చాలా సంతోషం కలిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రవీష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
రామన్ మెగసెసే పురస్కారం...న్యూయార్క్ కు చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది.
ఈ బహుమతిని ప్రధానంగా రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్‌కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఈ బహుమతిని ప్రధానంగా జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత,ప్రభుత్వ సేవ,ప్రజా సేవ,సామాజిక నాయకత్వం, ప్రపంచ శాంతి,అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు వంటి ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!