అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ లో కీలక సూచనలు ఇచ్చిన మోడీ
- August 05, 2019
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు.
కశ్మీర్‌పై నిర్ణయం నేపథ్యంలో తమకు కేంద్రం నుంచి హెచ్చరికలు అందినట్టు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు వివరించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వబోమన్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..