కశ్మీర్‌ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

- August 06, 2019 , by Maagulf
కశ్మీర్‌ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

దిల్లీ: కశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాసలోని శాశ్వత సభ్య దేశాలకు తెలియజేసింది. ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్‌పై పార్లమెంటులో జరిగబోయే పరిణామాలను వివరించారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌ అంతర్గత విషయం అయినప్పటికీ.. ఆయా దేశాల ఆసక్తి మేరకు ఈ అంశంపై వారికి వివరించినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో సుపరిపాలన, రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధికి అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన దోహదం చేస్తాయని వారికి వివరించారు.

దీనిపై అమెరికా స్పందిస్తూ.. నియంత్రణ రేఖ వెంబడి భాగస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని అమెరికా సూచించింది. అలాగే ఐరాస అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కశ్మీర్‌పై భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంయమనం పాటించాలని సూచించారు.

జమ్ముకశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించారు. ఈ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com