ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్‌పై దుబాయ్ పోలీస్ ప్రకటన
- August 07, 2019
దుబాయ్:వాహనదారులు తమ వాహనాల్ని జాగ్రత్తగా నడపడం ద్వారా, చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాల నుంచి ఉపశమనం పొందవచ్చునని దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేవారి క్రమశిక్షణ వృధా పోదనీ, అలాంటి వారికి చిన్న చిన్న ఉల్లంఘనల నుంచి ఉపశమనం కల్పిస్తామని పేర్కొన్నారు. మోటరిస్టులు ట్రాఫిక్ చట్టాల్ని పద్ధతిగా అనుసరించడం కోసం తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో, అంతకు ముందు జరీమానాల్లో 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే, అంతకు ముందు ఉల్లంఘనల నుంచి 50 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. అదే 12 నెలలపాటు వాహనాల్ని జాగ్రత్తగా నడిపితే, ముందున్న జరీమానాల నుంచి 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంది. 9 నెలలకు 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







