పసిడి ధర పెరిగే అవకాశం!
- August 07, 2019
అంతర్జాతీయంగా అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ సంపదను బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అంటే మాత్రం, సమీప భవిష్యత్తులో మాత్రం అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకే ఇందుకు కారణం, భవిష్యత్తులో బ్రెగ్జిట్ అంశం మార్కెట్లను కలవరపరచడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో బంగారం అంతకంతకు ధర పెరుగుతుందే తప్ప దిగే సూచనలు కనిపించడం లేదు. అలాగే రూపాయి మరింత బలపడే అవకాశాలు సైతం తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో బంగారం ఊహకు అందనంత రేంజిలో పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే దీర్ఘకాలంలో అంతర్జాతీయ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు తప్పకుండా ఫిజికల్ బంగారం కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







