'ఇండియన్2' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- August 16, 2019
ప్రముఖ దర్శకుడు శంకర్ , విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు2 ఫస్ట్ లుక్ గురువారం ఉదయం విడుదలైంది. 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు రికార్డులు తిరగరాసింది. ఈ సినమాకు సీక్వేల్ గా భారతీయుడు2 వస్తోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళం, తెలుగు, హిందీతో పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తీయనున్నారు. భారతీయుడు2లో కమల్ హాసన్ కు జోడీగా ప్రముఖ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో, నెగటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ సైతం ప్రముఖ పాత్రలో నటించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. భారతీయుడులో పోషించిన సిబిఐ అధికారి పాత్రలోనే ఈ సినిమాలో కూడా నెడుమూడి వేణు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!