మోదీపై ధ్వజమెత్తిన ఇమ్రాన్
- August 16, 2019
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడి నేతృత్వంలోని హిందుత్వ మూకలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు విఫలమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రపంచంలో సైన్యాలు, మిలిటెంట్లు, ఉగ్రవాదులను అంతకంటే బలమైన శక్తి అణచివేయగలదని చెప్పారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రజలు చావుకు భయపడరని స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఏ శక్తీ వాళ్లను తమ లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని హిందుత్వ విధానాలకు వకల్తా పుచ్చుకున్న ఫాసిస్ట్ మోడి అర్థం చేసుకోవాలని సూచించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపైనే ఇమ్రాన్ తన అక్కసును మళ్లీ వెళ్లగక్కారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!