NRI లను బురిడీ కొట్టిస్తున్న కొందరు నెల్లూరు బిల్డర్లు

- August 17, 2019 , by Maagulf
NRI లను బురిడీ కొట్టిస్తున్న కొందరు నెల్లూరు బిల్డర్లు

సగటు మధ్య తరగతి మనషికి సొంత ఇల్లు కట్టడం అన్నది జీవిత కాలం కోరిక.అందులో సొంత  ఊరు, బంధువులు, స్నేహితులు అందరినీ వదిలి పొట్ట చేత పట్టుకొని పక్క రాష్టాలకు, విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి చెమటోడ్చి కష్టపడి సంపాదించి,సొంత ఇల్లు కట్టుకోవటానికి సొంత ఊరిలోనే NRI లకు ఆస్థి రక్షణ లేకుండా పోయింది.20 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును కొంత మంది వైట్ కాలర్ క్రిమినల్ బిల్డర్లు NRI లను బలిపశువుని చేసి ఒక్క సంవత్సరములో ఆ సొమ్ముని బహిరంగంగా  దోచుకుంటున్నారు.నెల్లూరు లో ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా NRI లకు భయాందోళన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. చాల మంది NRI లు ఇటువంటి  పరిస్థితులకు భయపడి తాము నివసిస్తున్న దేశం లోనే, రాష్ట్రం లోనే  ఆస్తులు కొంటున్నారు. నెల్లూరు లో గత సంవత్సరాలుగా వస్తున్న వాత్సవ కధనాలు NRI లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. NRI లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు తమ ఊరికి తరుచు రాలేరు అన్న కారణం తో ఈ క్రిమినల్ బిల్డర్ లు తమ డ్రామాలు సాగిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు దానికి వంతు పలుకుతున్నారు.  

కొంతమంది వైట్ కాలర్ క్రిమినల్ బిల్డర్స్ పెద్ద మనుషుల్లాగా చెలామణి అవుతూ కోట్లకు పడగలు విప్పి అక్రమ ఆస్తులు సంపాదించి ప్రభుత్వ టాక్సులు  చెల్లించకుండా తప్పించు కుంటున్నారు.GST, INCOME  TAX , కార్పొరేషన్, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం పట్టించుకోకుండా తమ జెబులు నింపుకొని, ప్రభుత్వ ఖజానా కు గండిపెట్టి కోట్లు కూడపెట్టుకుంటున్నారు.ఇటువంటి క్రిమినల్ బిల్డర్ల మీద INCOMETAX, GST  అధికారులు  తగిన చర్యలు తీసుకుంటే మన రాష్ట్రానికి ఎక్కువ NRI విదేశీ పెట్టుబడులు తరలి వస్తాయి. 

కొందరు వైట్ కాలర్  క్రిమినల్ బిల్డర్లు NRI లను బురిడీ కొట్టిస్తున్న వైనం ప్రత్యక్ష సాక్షుల

కధనం ప్రకారం ఇలావుంది :-
మెటీరియల్ కాంట్రక్టు కింద ఇల్లు కట్టడానికి ఉప్పందం కుదుర్చుకొని సాధ్యమైనంత వరకు కోర్ట్ పేపర్ మీద అగ్రిమెంట్ తప్పించి , వైట్ పేపర్ మీద చేయించి మొదటినుంచి జాగ్రత్త పడతారు. ఎంతోస్నేహ భావంతో ఉండి సొంత మనిషిలాగా నటించి సినీ పక్కిలో బురిడీ కొట్టిస్తున్నారు.సదరు కార్పొరేటర్లు మరియు లోకల్ మాఫియా తో మరియు కొంతమంది కార్పొరేషన్ సిబ్బంది తో కుమ్మక్కయి, చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకోని ఇల్లీగల్ కంస్త్రుక్షన్ పేరుతో హై కోర్టులో  పిటిషన్ వేసి, కార్పొరేషన్ సిబ్బందితో బెదిరించి, భయపెట్టి ఎటువంటి నోటీసులు లేకుండా పనులు ఆపి భయభ్రాంతులను చేసి భారీ మొత్తంలో డబ్బుని డిమాండ్ చేసి దోచుకుంటున్నారు. ఈ కధనం అంతా మీ  బిల్డర్ మీ స్నేహితుడుల ఉండి  తనకు ఏమి తెలియదు అన్నట్టు నమ్మించి సినీ పక్కి లో మొత్తం కథకు డైరెక్టర్ లాగా  ఉండి చిన్న అనుమానం కూడా రాకుండా తప్పించుకుంటున్నాడు.స్టీల్, సిమెంట్ రేట్లు పెరిగాయి అంటూ మొత్తం ప్రాజెక్ట్ డబ్బులు అడ్వాన్సుగా  తెప్పించుకొని, బిల్డింగ్ తొందరగా పూర్తి చేస్తాను అని నమ్మించి, పెద్ద మొత్తం డబ్బు అందిన వెంటనే ముఖం చాటేసి, ఒక సంవత్సరం లో పూర్తి అవ్వవలసిన బిల్డింగ్ ని మూడు సంవత్సరాలు పొడిగించి, దోచిన సోమ్ముతో వడ్డీలకు  తిప్పి ఇంకా ధనార్జన చేస్తున్నారు. 

తమకు జరిగిన మోసం తెలుసుకొని సదరు బిల్డర్ ని నిలదీస్తే, గొడవల మూలంగా ఖర్చు పెరిగింది మరియు టైం వృధా అయ్యింది అని కాకమ్మ కబుర్లు చెప్పి సాఫీగా బురిడీ కొట్టేసి చట్టానికి దొరకకుండా దర్జాగా పెద్ద మనిషి లాగా తప్పించుకొని  తిరుగుతున్నారు.
NRI లు తమ ఉద్యోగం, ఉపాధి మానుకొని పోలీస్ స్టేషన్ మరియు కోర్ట్ చుట్టూ తిరిగే టైం మరియు సెలవు లేక, తమ కష్టార్జితాన్ని ఈ దగుల్బాజీ బిల్డర్ల పాలు చేసి తిరిగి విదేశాలకు వెళ్లి పోతున్నారు. ధెర్యంగ ఎదురు తిరిగిన NRI లకు చంపుతాము లేక దొంగ కేసులు పెట్టి నెల్లూరు లోనే బందీ చేస్తాము అని బెదిరించి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. 


రాష్ట్ర  ప్రభుత్వము, APNRT , APNRI Police Cell దీని మీద వెంటనే స్పందించి సదరు బిల్డర్లను కఠినంగా శిక్షించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా,NRI లకు పూర్తి భరోసా కలిగించే భాద్యత ఎంతైనా అవసరం ఉంది.ప్రక్క రాష్ట్రం కేరళలో మాదిరి మన రాష్ట్రం లో కూడా కఠిన చట్టాలు అమలు కావాలి.

గత మూడు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఒక క్రిమినల్ బిల్డరును ధైర్యంగా 

ఎదుర్కొని పోరాడుతున్న యదార్థ గాథ:
షేక్ రఫీ, అరవిందనగర్, నెల్లూరు నివాసి  దుబాయ్ లో 25 సంవత్సరాలుగా స్థిరపడిన NRI  సదరు బిల్డర్ తోట.నాగరాజు , మోడరన్ బిల్డర్స్,నెల్లూరు చేతిలో అతి ఘోరంగా 50 lakh మోసపోయి 5 -4 -2019 , 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో FIR :139 /2019 రిజిస్టర్ చేసి 4 నెలలు అయినా సదరు ముద్దయిని కోర్టుకి హాజరు పరచలేదు.గత 4 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలిసిపోయి న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన యదార్ధ గాధ APNRT, NRI పోలీస్ సెల్ వెంటనే స్పందించి, మరిన్ని కఠిన చట్టాలు తెచ్చి NRI ల మనోధైర్యాన్ని పెంచాలని కోరుకుంటున్నాము.

ఈ ఆర్టికల్ ప్రపంచం లో ఉన్న అన్ని తెలుగు అసోసియేషన్స్ కి చేరే తట్టుగా వైరల్ చేసి మన హక్కులను కాపాడుకోవాలి.సదరు బాధితులు ప్రపంచ వ్యాప్తంగ తెలుగు NRI లు ఒక్క తాటిఫై పోరాడాలని ఆశిస్తూ, ఇది అందరికీ కనువిప్పు కావాలని, ముందు జాగ్రత్త పడాలని పై విధముగా ఎవరైనా భాదితులు ఉంటే  వెంటనే స్పందించి తమ అనుభవాలను పంచుకొని న్యాయ పోరాటం చేయాలని ఆకాంక్షిస్తున్నాం.మీ వివరాలు ఈ వాట్సాప్ నెంబర్ కు 00919848628000 చెయ్యగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com