రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌

- August 17, 2019 , by Maagulf
రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌

మస్కట్‌:రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌ హెలికాప్టర్‌, అల్‌ బతినా గవర్నరేట్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించింది. ఆర్‌ఎఎఫ్‌ఓ టీమ్‌, ఓ పౌరుడ్ని ఈ ఆపరేషన్‌లో రక్షించినట్లు అధికారులు తెలిపారు. అల్‌ బతినా గవర్నరేట్‌లోని సముద్రంలో ఓ బోటులో బాధితుడు ఇరుక్కుపోయాడనీ, అతన్ని రెస్క్యూ సిబ్బంది రక్షించారని అధికారులు వివరించారు. సిటిజన్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని తెలుస్తోంది. విలాయత్‌ ఆఫ్‌ అల్‌ ముస్నాన్నాహ్‌ సమీపంలో బోట్‌ కనిపించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com