బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 17, 2019
బహ్రెయిన్:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో ఘనంగా జరిగాయి. బహ్రెయిన్‌లో భారత అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, జాతీయ పతాకం ఆవిష్కరించడంతో ఈ వేడుకలు సీఫ్‌లోని ఇండియన్ ఎంబసీలో ప్రారంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చదివి విన్పించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఈ వేడుకల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పలు చోట్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఆయా సంస్థలు నిర్వహించాయి. గురుదేవా సోషల్ సొసైటీ వద్ద యాక్టింగ్ ఛైర్మన్ జోసెకుమార్ మరియు జనరల్ సెక్రెటరీ రాజేష్ కనియంపురంబి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, కేరళ సోషల్ మరియు కల్చరల్ అసోసియేషన్ కూడా పంద్రాగస్టు వేదికల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







