'చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్
- August 19, 2019
శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో శివ కందుకూరి పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆగస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ను ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంటల్ మదిలో` కెమెరా మెన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..