కువైట్‌లో విస్తరిస్తున్న ఫుడ్‌ ట్రక్స్‌

- August 19, 2019 , by Maagulf
కువైట్‌లో విస్తరిస్తున్న ఫుడ్‌ ట్రక్స్‌

కువైట్‌: స్మాల్‌ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎస్‌ఎంఈ) విస్తరణలో భాగంగా యూత్‌, సరికొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్‌ ట్రక్స్‌ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. వివిధ రకాలైన ఆహార పదార్థాల్ని తాజాగా వండి వడ్డించేలా ఈ ఫుడ్‌ ట్రక్స్‌ రూపుదిద్దుకుంటుండడం గమనార్హం. పౌరులు, నివాసితులకు అభిరుచులకు తగ్గట్టుగా వీటిని డిజైన్‌ చేస్తున్నారు. కువైట్‌ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ తరహా ఫుడ్‌ ట్రక్స్‌ దర్శనమిస్తున్నాయి. అత్యద్భుతమైన డిజైన్స్‌తో ఆకట్టుకుంటున్న ఫుడ్‌ ట్రక్స్‌, ఆహార ప్రియుల అవసరాల్ని తీర్చుతున్నాయి. దాంతో, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. స్వయం ఉపాధి తమకు ఈ రకంగా దొరుకుతోందని యువత అంటున్నారు. 

--షేక్ బాషా (కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com