రాజశేఖర్ మరోసారి థ్రిల్ సినిమా చేస్తారట

- August 19, 2019 , by Maagulf
రాజశేఖర్ మరోసారి థ్రిల్ సినిమా చేస్తారట

'గరుడవేగ' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఐతే, ఆ తర్వాత ఆయన నటించిన కల్కీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొంటారని అందరూ భావించారు. కానీ, ఆయన మరోసారి థ్రిల్లర్ కథని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. 'బేతాళుడు' చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ అని తెలిసింది. ఓ నవల ఆధారంగా కథని రెడీ చేసుకొన్నారట. ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com