కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో ముగియనున్న సలాలా టూరిజం ఫెస్టివల్
- August 22, 2019మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2019 ముగింపు దశకు చేరుకుంది. ఆగస్ట్ 23న ముగియనున్న ఈ వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని డిజైన్ చేశారు. సంప్రదాయ అల్ బరా కాంపిటీషన్ ఇందులో ఒకటి. ఏడవ ఎడిషన్ ఒమనీ ఫోక్లోర్ సాంగ్ కాంపిటీషన్‌కి తోడుగా సంప్రదాయ అల్ బరా కాంపిటీషన్ కూడా జరుగుతుంది. స్థానిక అలాగే జీసీసీ మరియు అరబ్ ఆర్టిస్టులు, నటులు ఈ ప్రోగ్రామ్‌లు పాల్గొననున్నారు. మునిసిపాలిటీ రిక్రియేషన్ సెంటర్ వద్ద జరిగే కార్యక్రమాలకు తోడు, పలు ఇతర ఆకర్షణీయ అంశాలు మరింత ప్రత్యేకంగా ముగింపు వేడుకల్లో సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. కాగా, ఈ ఫెస్టివల్లో ఎగ్జిబిషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌తోపాటు ప్రైవేటు కంపెనీలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఒమనీ విమెన్ అసోసియేషన్స్, క్రాఫ్ట్ సెంటర్స్‌కి మార్కెటింగ్ పెవిలియన్స్ని కూడా పొందుపరిచారు. హోలీ కురాన్ మెమొరైజింగ్ కాంపిటీషన్, ఫొటోగ్రఫీ ఫెస్టివల్, ఫైన్ ఆర్ట్స్ కాంపిటీషన్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు