నిత్యా మీనన్ ఫిజిక్ పై కామెంట్లు...పెదవిప్పిన నటి
- August 22, 2019
నిత్యా మీనన్ మంచి నటిగా అందరికీ తెలుసు. ఎంపిక చేసుకున్న పాత్రల్లో మాత్రమే నటిస్తుంది. అందుకే ఎక్కువ చిత్రాల్లో ఆమె కనిపించదు. కెరీర్‌పై స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉన్న నిత్య ఇటీవల హిందీ చిత్రం మిషన్ మంగళ్ లో నటించింది. మరో వైపు ఆమె శరీరాకృతిపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీవీ యాడ్స్‌లో సైతం నిత్యామీనన్ లావెక్కినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఆమె స్పందించింది. లావుగా కనిపించే వారి గురించి కొందరు చులకనగా మాట్లాడుతుంటారు. ఇది సరికాదు. తిని కూర్చోవడం వల్ల ఇలా అయ్యారనేది వారి అభిప్రాయం. ఆర్టిస్టుల విషయానికి వస్తే వారు తమ శరీరంపై ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తుంటారు. అయినప్పటికీ లావుకావడం హార్మోన్ల ప్రభావం వల్ల కావచ్చు. ఇది గ్రహించాల్సిందిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి గుర్తిచేస్తున్నాను అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!