జి-7లో భగ్గుమన్న విభేదాలు
- August 26, 2019
బియారిట్జ్ (ఫ్రాన్స్): పర్యావరణకారుల నిరసనల మధ్య శనివారం నాడిక్కడ ప్రారంభమైన జి-7 దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సులో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధానంగా గ్లోబల్ వాణిజ్య ఉద్రిక్తతలు, ఇయు నుంచి బ్రిటన్ నిష్క్రమణ (బ్రెగ్జిట్), అమెజాన్ వర్షపు అడవుల దగ్ధంపై ధనిక కూటమి సభ్య దేశాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మూడు రోజుల సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ, సంపన్నదేశాలన్నీ ఒకే వాణిని వినిపించాలన్నారు. ఇటీవల కాలంలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించే ధోరణి పెరిగిపోయిందని మాక్రాన్ అన్యాపదేశంగా చెప్పారు. ప్రజాస్వామ్యం, స్త్రీ పురుష సమానత్వం, విద్య, పర్యావరణ పరిరక్షణకు గట్టిగా నిలవాలని సంపన్న దేశాల కూటమిలో సభ్యదేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ముందు ఎజెండా ఉంచారు. అమెరికాకు, ఒకప్పటి దాని సన్నిహిత మిత్రులైన యూరోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సంబంధాలపై సదస్సు పైపైన మదింపు వేసిందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్కు అన్నారు. చైనాపై ట్రంప్ కొనసాగిస్తున్న వాణిజ్య పోరుపై ఈ సదస్సులో ఐరోపా నేతలు ట్రంప్‌ను హెచ్చరించారు గత జి-7 శిఖరాగ్ర సదస్సు ట్రంప్ సమావేశం చివరిదాకా ఉండకుండా ముందే లేచి వెళ్లిపోవడంతో అది అభాసుపాలైంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







