బావిలో పడి వ్యక్తి మృతి

బావిలో పడి వ్యక్తి మృతి

ఒమాన్: బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ పరిధిలో జరిగింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. బావిలోంచి ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు అధికారులు వివరించారు. అల్‌ ఫతెరా ప్రాంతంలోని బహ్లా విలాయత్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

 

Back to Top