మెంతుల వల్ల కలిగే లాభాలు...
- August 28, 2019ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం.
మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు.
గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది.
మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే కచ్చితంగా కరిగిపోతుంది. ( నానబెట్టి మెంతులు+ మజ్జిగ రెండు కలిపి తాగాలి.)
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..