అడ్వాన్స్ బుకింగ్ తోనే రికార్డ్స్ మొదలు పెట్టిన సాహో.
- August 29, 2019
మరో 24 గంటల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో ప్రభంజనం మొదలు కాబోతుంది..ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ ప్రేమికులే కాదు సినీ వర్గాలు సైతం ఆసక్తి గా ఉన్నారు. వీరి ఆసక్తి తగ్గట్లే గతంలో ఎన్నడూ లేని విధంగా థియేటర్స్ లలో సాహో ను దింపేస్తున్నారు. సిటీ లో పది థియేటర్స్ ఉంటె దాదాపు తొమ్మిది థియేటర్స్ లలో సాహో ప్రదర్శన కాబోతుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ నమోదు చేయగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ తోనే సరికొత్త రికార్డు మొదలు పెట్టింది.
ఆగస్టు 28వరకు అందిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఐమాక్స్ మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా అన్ని భాషలలో కలిపి $532,727 వసూళ్లు రాబట్టింది. కేవలం తెలుగు ఐమాక్స్ మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $511,702 వసూళ్లు సాధించింది. కేవలం హిందీ వర్షన్ కి గాను $16,899 మరియు తమిళ వర్షన్ ద్వారా $4,126 వసూళ్లు కొల్లగొట్టింది. ఇక అన్ని భాషల ఐమాక్స్ షో ల వరకు $77418 మరియు రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $455309 వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ రేంజ్ లో రాబడితే మిగతా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో అని లెక్కలు వేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!