స్కూల్ ఫస్ట్ డే: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీచర్
- September 03, 2019
యూఏఈ: కొత్త అకడమిక్ ఇయర్ తొలి రోజు రోడ్డు ప్రమాదంలో టీచర్ గాయపడిన ఘటన అల్ అయిన్‌లో చోటు చేసుకుంది. అల్ సరూజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో టీచర్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. పార్కింగ్ లాట్‌లోని తన కారు వద్దకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీబ్రా క్రాసింగ్ వద్దనే ఆమె రోడ్డు దాటగా, ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఆమెను ఢీకొంది. పోలీసులు, ఈ ఘటనలో కారు డ్రైవర్‌దే తప్పుగా తేల్చారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకుంది. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కాగా, రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై జరీమానా విధిస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..