తెలంగాణ:హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు..
- September 05, 2019తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసిపోయింది. అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 4తోనే దరఖాస్తు గడువు ముగిసింది. పాత గడువుని సవరిస్తూ మరో రెండు వారాలు అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు: 1,539.. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా.. వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2019
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు