ట్యాంకర్ని ఢీకొన్న స్కూల్ బస్: 15 మందికి గాయాలు
- September 09, 2019
యూఏఈ: అల్ వర్కాలో గల ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్‌లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ని స్కూల్ బస్సు ఢీకొన్నట్లు ప్రాథమిక వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్‌కి కూడా గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పిటల్‌కి తరలించారు. ఎలాంటి గాయాలూ కాని విద్యార్థుల్ని స్కూల్‌కి తరలించి, అక్కడ వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇదిలా వుంటే, గాయపడ్డ విద్యార్థులకు కూడా మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!